: యాకూబ్ మెమన్ కు జైల్లో భద్రత పెంపు
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో యాకూబ్ మెమన్ కు సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో నాగ్ పూర్ సెంట్రల్ జైల్ వద్ద భద్రత పెంచారు. 1993లో ముంబయిలో విధ్వంసం సృష్టించడంలో యాకూబ్ కీలకపాత్ర పోషించాడంటూ, సుప్రీం నిన్న వెలువరించిన తీర్పులో అతనికి ఉరి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, నాగ్ పూర్ జైల్లో యాకూబ్ ఉన్న సెల్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఇదే కేసులో ఇక్కడ ఖైదీలుగా ఉన్న మరో ముగ్గురితో యాకూబ్ కు సంబంధాలు లేకుండా అతనిని ఓ ప్రత్యేక సెల్ లో ఉంచినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో యాకూబ్ ఒక్కడికే అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరో పదిమందికి టాడా కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం జీవిత ఖైదుగా మార్చింది.