: విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం: బీజేడీ సభ్యుడు బెహరా


ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు శశిభూషణ్ బెహరా రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని బెహరా అన్నారు. విభజన బిల్లు విషయంలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కన్పించిందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడానికి బీజేడీకి అభ్యంతరం లేదని బెహరా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడాన్ని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News