: నెంబర్ వన్ పీఠంపైకి మళ్ళీ స్టెయిన్


సఫారీ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో అగ్రపీఠాన్ని అలంకరించాడు. ఇంతకుముందు డేల్ తన నెంబర్ వన్ ర్యాంకును సహచరుడు వెర్నాన్ ఫిలాండర్ కు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో సెంచూరియన్ టెస్టులో 6 వికెట్లు తీసిన ఈ మెరుపువీరుడు ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. అదే టెస్టులో కేవలం ఒక్క వికెట్టే తీసిన ఫిలాండర్.. రెండోస్థానానికి పడిపోయాడు. ఇక, ఇటీవల కాలంలో నిప్పులు చెరుగుతున్న ఆసీస్ పేస్ అస్త్రం మిచెల్ జాన్సన్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు దక్కించుకున్నాడు. కాగా, ఈ జాబితాలో నిలిచిన టీమిండియా బౌలర్ అశ్విన్ ఒక్కడే. అశ్విన్ పదో స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News