: సీమాంధ్రకే కాదు.. తెలంగాణకూ ప్యాకేజీనివ్వాలి: మాయావతి
రాజ్యసభలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ప్రసంగించారు. మాయావతి ప్రసంగించే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రిన్ అడ్డుతగిలారు. మాయా ప్రసంగిస్తోంటే ‘నో నో’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. గందరగోళం మధ్యే మాయావతి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని మాయావతి చెప్పారు. బీహర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను విభజించినప్పుడు ఏర్పడిన సమస్యలు సమసిపోయాయని మాయా తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో పాటు తెలంగాణకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని మాయా డిమాండ్ చేశారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం సరైంది కాదని ఆమె అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మాయావతి గుర్తుచేశారు.