: ప్రధాని సమక్షంలో చిరు విమర్శలపై జైట్లీ అభ్యంతరం
రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి చిరంజీవి ప్రధానమంత్రి ఎదురుగానే సభలో విభజనపై విమర్శలు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఈ క్రమంలో చిరు మాట్లాడుతుండగానే లేచి ఖండించిన జైట్లీ, ఆయన(చిరు) తన అభిప్రాయాలను మంత్రిగా చెబుతున్నారా? తను వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తి స్పీకర్ ను రూలింగ్ ఇవ్వాలని కోరారు. దాంతో, స్పందించిన డీప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్, ఆ విధంగా మాట్లాడిన సభ్యుడు చిరంజీవి అలా మాట్లాడటం నైతికం అవునా? కాదా? అని అతనే నిర్ణయించుకోవాలని చెప్పారు.