: సస్పెండ్ చేస్తా... సుజనాకు కురియన్ వార్నింగ్


వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో టీబిల్లు చర్చపై తీవ్ర గందరగోళం చెలరేగింది. చర్చను చేపడదామని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదే పదే విన్నవించారు. బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా శ్రమించాయి. ఈ నేపథ్యంలో పోడియంలో ఉన్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి, కురియన్ కు వాగ్వాదం జరిగింది. దీంతో సుజనాకు కురియన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు సభను అడ్డుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని... సభకు ఇలాగే విఘాతం కలిస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News