: 'బీజేపీ 400 కోట్లు ఏ వ్యాపారం చేసి సంపాదించింది?'
ఎన్నికల ప్రచారానికి ఖర్చుచేయనున్నట్టు చెబుతున్న 400 కోట్ల రూపాయలు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆ 400 కోట్ల రూపాయలు నల్లధనమా? లేక బీజేపీ ఏదయినా వ్యాపారం చేసి సంపాదించిందా? అని నిలదీశారు. బీజేపీ ప్రచారానికి అంబానీ లేదా అదానీ నిధులిచ్చారా? అని కడిగేశారు. బీజేపీ ప్రచార బాధ్యతలు తలకెత్తుకోవద్దని పియూష్ పాండే, ప్రసూన్ జోషిలకు అశుతోష్ విజ్ఞప్తి చేశారు.