: రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీం స్టే
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఏడుగురు హంతకులను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతేగాక, తమిళనాడు ప్రభుత్వానికి, నిందితులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ ఉదయం కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్డు పైవిధంగా తీర్పునిచ్చింది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది. దాంతో, హంతకులను విడుదల చేయాలనుకున్న తమిళనాడు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.