: కాంగ్రెస్, బీజేపీల మధ్య 'టీ' వార్
కాంగ్రెస్, బీజేపీ జాతీయ కార్యవర్గాల మధ్య ఆసక్తికర తెలంగాణ వార్ జరుగుతోంది. బిల్లుపై సవరణలకు పట్టుబడతామని బీజేపీ బెట్టు చేస్తుండగా, ఏం చేస్తే అది చేసుకోండని చెబుతూ బీజేపీ ఆగ్రనాయకత్వంతో కాంగ్రెస్ కేంద్ర మంత్రులు మంతనాలు సాగిస్తూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై మరోసారి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేందుకు స్కెచ్ గీస్తున్నాయని సీమాంధ్ర నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు సీమాంధ్రలో రెండు పార్టీలూ తమ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అని, అందుకే దీనిపై చర్చల పేరుతో రెండు పార్టీలు నిన్నటి నుంచి హడావిడి చేస్తున్నాయని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎవరు బెట్టు చేసినా, చేయకున్నా జరిగేది, ఒరిగేదీ ఏదీ లేదని... ఇకనైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానుకుని వాస్తవాలు మాట్లాడాలని ప్రజలు సూచిస్తున్నారు.