: రాహుల్ ను క్షమాపణలు కోరుతున్న 22 ఏళ్ల యువతి


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 22 ఏళ్ల హరిత్రా శ్రీనివాసన్ క్షమాపణలు కోరుతోంది. ఈమె రాహుల్ తండ్రి రాజీవ్ హత్య కేసులో దోషులైన మురుగన్, నళినిల కుమార్తె. తొమ్మిదేళ్లుగా బ్రిటన్ లో ఉంటోంది. తన తల్లిదండ్రులను క్షమించాలని రాహుల్ కు విజ్ఞప్తి చేసింది. జరిగిన దానిపై తన తల్లిదండ్రులు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని చెప్పింది. 'మీరు ప్రేమించే వ్యక్తిని (రాజీవ్) కోల్పోయారు. అదే శిక్ష నేను కూడా అనుభవిస్తున్నాను. నా తల్లిదండ్రులు బతికే ఉన్నా, వారికి దూరంగా జీవిస్తున్నాను. ఒకవేళ వారు నేరం చేసి ఉంటే అందుకు తగిన శిక్ష అనుభవించారు' అని హరిత్రా పేర్కొంది. తన తల్లిదండ్రులను విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

  • Loading...

More Telugu News