: వారి ఛాంబర్ లోనే బిల్లు పాస్ చేసుకోవల్సింది: సుజనా చౌదరి


రాష్ట్ర విభజన బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలే బిల్లుపై మాట్లాడుకుని, చర్చలు జరుపుకుంటున్నప్పుడు వారి ఛాంబర్ లోనే బిల్లు పాస్ చేసుకోవాల్సిందని, ఇక పార్లమెంటులో బిల్లు పెట్టడమెందుకన్నారు. రాజ్యసభలో ఈ రోజు తామిచ్చిన నోటీసులపై తొలుత చర్చ కోరతామని, ఆ తర్వాత బిల్లులోని సవరణలపై చర్చ పద్ధతి ప్రకారం జరగాల్సిందేనంటూ డిమాండ్ చేస్తామన్నారు. ఆ సవరణలకు కచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలని, 2/3 మెజారిటీతోనే ఆమోదించాలని పట్టుబడతామన్నారు. లోక్ సభలో అతి ఘోరాతిఘోరంగా గతంలోని ఎమర్జెన్సీని గుర్తుకు తెచ్చేలా ప్రవర్తించారని ఆగ్రహించిన సుజనా, పెద్దల సభలో అలాంటి ఘటన చోటు చేసుకునేందుకు బీజేపీ సహకరించదని తాననుకుంటున్నట్లు ఢిల్లీలో చెప్పారు.

  • Loading...

More Telugu News