: రాజ్యసభలో మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బిల్లుపై చర్చ
రాజ్యసభలో మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించనున్నారు. సీమాంధ్రులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండడంతో, ఆ పార్టీ సూచించిన సవరణలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా? లేక ఎప్పట్లానే రెండు పార్టీలు ఒక్కటై చర్చ లేకుండానే బిల్లును అమోదిస్తాయో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.