: డీఎంకే నేత స్టాలిన్ పై సీబీఐ కేసు


డీఎంకే నేత స్టాలిన్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాల నుంచి 33 కార్లు దిగుమతి చేసుకున్న వ్యవహారంలో సుంకం చెల్లించకుండా ఎగ్గొట్టారని.. అందుకే ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఐపీసీ 120బి, 420, 467, 468, 471 సెక్షన్లు 13(1), 13(2) ప్రకారం స్టాలిన్ తోపాటు డీఆర్ఐ అధికారిపై కేసు నమోదు చేశారు.

నిన్న ఉదయం చెన్నైలోని స్టాలిన్ నివాసంలో సీబీఐ దాడులు నిర్వహించింది. దీంతో సీబీఐని కేంద్రం వేధింపులకు ఉపయోగించుకుంటోందంటూ విపక్షాల నుంచి  విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నేడు స్టాలిన్ పై ఏకంగా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News