: కేజ్రీవాల్ దృష్టి ప్రధాని పదవిపైనే ఉంది: అన్నా హజారే
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి అంతా ప్రధాని పదవిపై ఉందని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తప్పుపట్టారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కూడా కేజ్రీవాల్ ఇంకా అధికారిక నివాసంలోనే ఉన్నారని నిలదీశారు. కేజ్రీవాల్ కు పదవీ కాంక్ష ఉందని పరోక్షంగా ఆరోపించిన హజారే, లోక్ సభ ఎన్నికల్లో తన మద్దతును మమతా బెనర్జీకి ప్రకటించిన సంగతి తెలిసిందే.