: తిరుమల కొండలలో విష సాలీడు
సాలీడే కదా అని చేత్తో నేట్టేయకండి. కాటేస్తే తల్లడిల్లిపోవాల్సిందే. నొప్పి భరించలేక కేకలు పెట్టాలి. ఎక్కడో ఆఫ్రికాలో కనిపించే ఆ విష సాలీడు తిరుమల శేషాచల కొండలలో తేలింది. అయితే బతికిలేదు లేండి. చనిపోయిన పోసిలో తెరియా మెటాలికే అనే ఈ సాలీడు కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ఇది కుడితే విపరీతమైన నొప్పితో పాటు మరణించే ప్రమాదం కూడా ఉంటుందట. 1899లో అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లో ఓ గూడ్స్ వ్యాగన్ లో దీనిని తొలిసారిగా గుర్తించారు. మళ్లీ ఇంతకాలం తర్వాత దీని ఆచూకీ దొరికింది.