: లోక్ సభ నియమానుసారమే సాగింది: కమల్ నాథ్


లోక్ సభ నియమానుసారమే సాగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్ నాథ్ తెలిపారు. మంగళవారం లోక్ సభలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. లోక్ సభలో ముసాయిదా బిల్లు పద్ధతి ప్రకారమే పాస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఈ నెల 3న బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు జరిగిన ఘటనలు దురదృష్టకరమని... కానీ, సభలో నిన్న అంతా నియమానుసారమే జరిగిందని ఆయన తెలిపారు. దానికి సంబంధించి ఇవాళ ఎలాంటి ఫిర్యాదు అందలేదని కమల్ నాథ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News