: సభ్యులు కాని వారు సభను ఎలా అడ్డుకుంటారు: జైట్లీ
రాజ్యసభలో కేంద్రమంత్రుల నిరసనపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు కాని వారు సభ కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ను బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్ తో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ వాగ్వాదానికి దిగారు. కేంద్రమే సమస్యలను సృష్టించి, దాన్ని విపక్షాలపై వేస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. దీంతో మంత్రులే ఆందోళన చేస్తే సభ నిర్వహణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.