: మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ వాయిదా
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ మూడు గంటల వరకు వాయిదా పడింది. సభ మొదలైన వెంటనే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేశ్, కేవీపీ ఎప్పటిలాగే వెల్ లోకి వెళ్లి నిరసన తెలపడం ప్రారంభించారు. మరోవైపు సభలో కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, జేడీ శీలం కూడా తమ సీట్లలో నిలుచుని నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటం, సభ సజావుగా నడపలేని పరిస్థితిలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.