: రాజ్యసభ వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. సీమాంధ్ర ఎంపీలు సభలో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదే పదే సభ్యులను వారించారు. టీడీపీ ఎంపీలు ఏకంగా కురియన్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో, సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.