: మార్చి నెల మొదటి వారంలో హైదరాబాదులో టీఆర్ఎస్ విజయోత్సవ సభ
మార్చి నెల మొదటి వారంలో హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయోత్సవ సభను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతున్న సందర్భంగా.. సంబరాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. లోక్ సభలో ముసాయిదా బిల్లును ఆమోదించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమవుతోందని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 22, 23 తేదీల్లో కేసీఆర్ హైదరాబాదు నగరానికి రానున్నారు. 24, 25 తేదీల్లో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించనున్నారు.