: ఏపీఎన్జీవోల సమ్మె విరమణ.. రేపటి నుంచి విధుల్లోకి
తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో ఏపీఎన్జీవోలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని రెవెన్యూ కార్యదర్శుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. ఇవాళ సీమాంధ్ర బంద్ దృష్ట్యా రేపటి నుంచి విధులకు హాజరవుతామని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు.