: సీమాంధ్రలో వెల్లువెత్తిన సమైక్యవాదుల నిరసన
లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యవాదుల నిరసనలు వెల్లువెత్తాయి. విజయవాడలోని బెంజి సర్కిల్ కు చేరుకున్న సమైక్యవాదులు ఇవాళ సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు టైర్లకు నిప్పింటించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా బెంజి సర్కిల్ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాస్ పోర్టు కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.
ఇక, తిరుపతి, విశాఖపట్నంలోనూ నిరసన ప్రదర్శనలు జరిగినట్లు వార్తలు అందుతున్నాయి. తిరుపతిలో సమైక్యవాదులు నినాదాలు చేస్తూ టైర్లకు నిప్పంటించారు. లోక్ సభలో ముసాయిదా బిల్లు ఆమోదం పొందటంపై వారు మండిపడుతున్నారు.