: 80 కోట్లకు అమ్ముడుపోయిన 'చైనీస్ గర్ల్'


'చైనా అమ్మాయి' అందం కళా హృదయాలను దోచుకుంది. ప్రఖ్యాత చిత్ర కారుడు వ్లాదిమర్ త్రెచికాఫ్ కుంచె నుంచి జాలువారిన 'చైనీస్ గర్ల్' అనే కళాఖండం 80 కోట్ల రేటు పలికింది. లండన్ లో జరిగిన వేలం పాటలో కళాభిమాని అయిన నగల వ్యాపారి లారెన్స్ గ్రాఫ్ అంత రేటు పెట్టి, ఈ 'చైనా అమ్మాయి' ని సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాలోని తన ఎస్టేట్ లో ఈ కళా ఖండాన్ని అలంకరిస్తానని లారెన్స్ చెబుతున్నాడు. రష్యా సంతతికి చెందిన వ్లాదిమర్, చైనాలోని షాంఘై లో పెరిగాడు. తర్వాత 1946లో దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు. కేప్ టౌన్ లో ఓ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న పదిహేడేళ్ళ మోనికా సింగ్ లీ అనే అమ్మాయిని మోడల్ గా ఎంచుకుని ఈ 'చైనీస్ గర్ల్' ఆర్ట్ ను ఆయన సృష్టించాడు.             

  • Loading...

More Telugu News