: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర్విభజన బిల్లుపై 20 నిమిషాల చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై లోక్ సభలో కేవలం 20 నిమిషాలు మాత్రమే చర్చ జరిపారు. కనీసం సవరణలపై ఓటింగ్ జరిగినంత సమయం కూడా చర్చకు కేటాయించకపోవడం విశేషం. సవరణలపై గంటపాటు ఓటింగ్ జరిగింది. తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీల సవరణలు వీగిపోయాయి.