: తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
తెలంగాణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించినట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై కేవలం 23 నిమిషాలు మాత్రమే చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా పూర్తయినట్టే.