: సంజయ్ దత్ పెరోల్ గడువు మరోసారి పొడిగింపు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పెరోల్ గడువును పూణెలోని ఎరవాడ జైలు అధికారులు మరోసారి పెంచారు. ఈ మేరకు మార్చి 21 వరకు సంజయ్ కు గడువు పెంచారు. భార్య మాన్యత అనారోగ్యం కోరణంగా గతేడాది చివరి నుంచే పెరోల్ పై బయట ఉన్న సంజయ్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికి రెండు సార్లు పెరోల్ గడువు పొడిగించారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంజయ్ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.