: టీమిండియా ర్యాంకు పదిలం
న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ లో ఓడినా భారత్ రెండో ర్యాంకు మాత్రం పదిలంగానే నిలిచింది. కారణం, చివరి టెస్టు డ్రాగా ముగియడమే. ఈ మ్యాచ్ లో గనుక టీమిండియా ఓటమిపాలై ఉంటే ఐసీసీ ర్యాంకుల జాబితాలో కిందకి జారి ఉండేది. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న ఆసీస్ అప్పుడు రెండోస్థానానికి చేరేది. కాగా, ఈ తాజా ర్యాంకుల జాబితాలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో నిలిచాయి. ఇక మనపై టెస్టు సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ విండీస్ ను వెనక్కినెట్టి ఏడోస్థానానికి ఎగబాకింది.