: ఒకే ఒక్క ఎద్దుతో... ఆ రైతుకు ఏడాదికి రూ.40లక్షలు!


అతనో సాధారణ రైతు. ఆయన ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్, హార్డ్ వేర్, మరే ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా మామూలోళ్లే. హర్యానాలోని కురుక్షేత్ర రైతు కరంవీర్ సింగ్ ఏడాది ఆదాయం 40లక్షల రూపాయలు పైనే. అది కూడా ఒకే ఒక్క ఎద్దు ద్వారా వస్తోంది. కరంవీర్ సింగ్ దగ్గర ముర్రాజాతికి చెందిన ఎద్దు ఉంది. దాని పేరు యువరాజ్!

దీని వీర్యానికి చాలా డిమాండ్. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తన ఎద్దు వీర్యానికి డిమాండ్ ఉందని, వీర్యం విక్రయం ద్వారా ఏడాదికి 40లక్షల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు తెలిపాడు. గర్భం దాల్చడానికి సరిపడా డోస్ ను 300 రూపాయలకు అమ్ముతున్నానని చెప్పాడు. మిగతా జాతి ఎద్దుల కంటే ముర్రాజాతికి పుట్టిన ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వడమే ఇంత డిమాండ్ కు కారణంగా కరంవీర్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News