: ఆమ్ ఆద్మీలో చేరిన హాకీ లెజెండ్ ధనరాజ్ పిళ్ళై
రాజకీయాల్లోకి వచ్చేందుకు క్రీడాకారులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత క్రీడాకారుడు ధనరాజ్ పిళ్ళై ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే సిద్ధమైన ఆమ్ ఆద్మీ తరపున ధనరాజ్ దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. గతంలో హాకీ ఆటగాళ్లు దిలీప్ టిర్కీ, పర్గత్ సింగ్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన మూడో ఆటగాడు ధనరాజ్.