: కోదండరాంకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్
సడక్ బంద్ కార్యక్రమంలో అరెస్టయిన తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంకు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించారు. సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం, ఈటెల, జూపల్లి తదితరులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వీరిని ఆలంపూర్ కోర్టులో ఈ సాయంత్రం హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.