: నేడు కర్ణాటకలో నరేంద్ర మోడీ పర్యటన
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు ఆయన కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దావణగెరె, మంగళూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించనున్నారు.