: కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ: షర్మిల
సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయని వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మేనని ఇప్పుడు స్టాలిన్ ఘటన మరోమారు రుజువు చేసిందని షర్మిల వ్యాఖ్యానించారు. యుపిఏ కు మద్దతు ఉపసంహరించిన మరుసటి రోజునే స్టాలిన్ ఇంటిమీద సీబీఐ చేత కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించిందని ఆమె తెనాలి పాదయాత్రలో ఆరోపణలు చేశారు.