: ముఖ్యమంత్రిపై సి.రామచంద్రయ్య ఫైర్
ముఖ్యమంత్రి కిరణ్ పై మంత్రి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసమే ముఖ్యమంత్రి సమైక్య ముసుగు వేసుకున్నారని ఆరోపించారు. జగన్ కు, కిరణ్ కు తేడాలేదని... కిరణ్ మాయలో మంత్రులు, ఎమ్మెల్యేలు పడరాదని సూచించారు. సీఎం కిరణ్ అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. కిరణ్ పార్టీ పెడితే అదొక చారిత్రక తప్పిదం అవుతుందని అన్నారు.