: పార్లమెంటు ముట్టడికి బయల్దేరిన జగన్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేస్తున్నారంటూ ఆయన తన శ్రేణులతో కలసి పార్లమెంటు దిశగా బయల్దేరారు. దీంతో, పార్లమెంటు పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.