: రేపు బిల్లుపై సభలో సోనియా మాట్లాడే చాన్స్


యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రేపు లోక్ సభలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుపై మాట్లాడే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ అన్నారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, రేపు లోక్ సభలో బిల్లుపై కచ్చితంగా చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా వ్యతిరేకించాలనుంటే పార్లమెంటరీ తరహాలో తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించారు. ఎంపీల సస్పెన్షన్ పై స్పీకర్ మీరా కుమార్ దే తుది నిర్ణయమని కమల్ నాథ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News