: రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధం


పార్టీలోనే ఉంటూ ఇంతకాలం పక్కలో బల్లెంలా తయారైన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్దమైంది. రేపోమాపో వీరిమీద చర్య తీసుకునేందుకు మార్గం ఇప్పుడు సుగమమైంది. వీరిపై వేటుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తాజా పరిస్థితికి కారణమైంది. దీంతో అవిశ్వాసం సందర్భంగా విప్ ధిక్కరించిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల భవితవ్యం త్వరలో తేలిపోనుంది.   

శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన ఢిల్లీ పర్యటనలో పార్టీ ప్రధాన నేతలకు వివరించారు. ఇవాళ ఈ అంశంపై బొత్స న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ అజాద్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి కూలంకుషంగా చర్చించినట్టు వెల్లడి.   

  • Loading...

More Telugu News