: సీఎంకు బొత్స ఘాటు లేఖ
సీఎం కిరణ్ పై బొత్స తన అసంతృప్తిని మరోసారి ప్రదర్శించారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చుతూ ఓ లేఖ రాశారు. కంతేటి, నంది ఎల్లయ్య, రత్నాబాయిలను ఎమ్మెల్సీలుగా నియమించాలని పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాలను పక్కన బెట్టడం ఎంతవరకు సమంజసం అని సీఎంను ప్రశ్నించారు. అంతేగాకుండా రంగారెడ్డి, రెడ్డప్పరెడ్డిలను శాసనమండలి విప్ లుగా నియమంచడం సముచితం కాదన్నారు. తద్వారా బడుగుబలహీన వర్గాలను పక్కనబెట్టినట్టయిందని విమర్శించారు.