: సైనికోద్యోగుల మోముల్లో చిరునవ్వులు పూయించిన చిదంబరం
ఇవాళ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి చిదంబరం సైనికోద్యోగుల మోముల్లో చిరునవ్వులు పూయించారు. ‘సైన్యంలో ఒకే ర్యాంకు, ఒకే ఫించను’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో మాజీ సైనికోద్యోగులకు ఫించన్లు భారీగా పెరగనున్నాయి.