: ఏపీఎన్జీవోల ఆందోళన వల్లే.. ఇప్పటివరకు విభజన ఆగింది: అశోక్ బాబు
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏపీఎన్జీవోల ‘మహా ధర్నా’ ప్రారంభమైంది. ఈ ఆందోళన కార్యక్రమానికి సీమాంధ్ర ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివచ్చారు. ఈ ధర్నాలో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు పాల్గొని ప్రసంగించారు. తెలుగు వారి సత్తా ఢిల్లీకి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందో, విడిపోతుందో తేలిపోతుందని ఆయన అన్నారు. ఏపీఎన్జీవోల ఆందోళనల వల్లే రాష్ట్ర విభజన ఇంతకాలం ఆగిందని ఆయన చెప్పారు. రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే.. దేశం ముక్కలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.