: అడ్డు తగిలితే టీవీ నుంచి చిదంబరం ప్రకటన చేస్తారు: కమల్ నాథ్
లోక్ సభ సమావేశాలకు సభ్యులు అడ్డు తగిలితే ఏదో ఒక టీవీ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రసంగం చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన క్రమంలో సభను అడ్డుకునేందుకు సీమాంధ్ర సభ్యులు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా ఆపేందుకు గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు.