: మూకుమ్మడి రాజీనామాలకు సీమాంధ్ర నేతల నిర్ణయం..?
ప్రస్తుతం హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సీమాంధ్ర నేతల భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి ఏడుగురు మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఎల్లుండి లోక్ సభలో విభజన బిల్లుపై చర్చ నిర్వహించనున్న నేపథ్యంలో ఇంకా ఉపేక్షించడం ఎందుకన్న భావనను కొందరు సీఎం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. పార్టీకి, పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి గవర్నర్ కు లేఖలు అందజేయాలని ఈ భేటీలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సీఎం రాజీనామా ఎప్పుడో చేయాల్సిందని, ఇప్పుడు చేసినందువల్ల ఒరిగేదేమీ లేదని సాక్షాత్తూ పీసీసీ చీఫ్ బొత్స వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఒకవేళ సీఎం రాజీనామా చేస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది కాలమే తేల్చాలి.