: ఈ నెల 18న లోక్ సభలో విభజన బిల్లుపై చర్చ
రాష్ట్ర విభజన బిల్లుపై ఈ నెల 18న లోక్ సభలో చర్చించనున్నారు. గురువారం ఈ బిల్లు ప్రవేశపెట్టగా, ఎంపీల ఆందోళనలతో సభ సోమవారానికి వాయిదా పడింది. రేపు బడ్జెట్ పై ఓటాన్ అకౌంట్ ఉంటుందని, మధ్యాహ్నం రైల్వే బడ్జెట్ పై చర్చ ఉంటుందని స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. ఎల్లుండి కీలకమైన విభజన బిల్లుపై చర్చ ఉంటుందని తెలిపారు.