: ముఖ్యమంత్రితో డీజీపీ సమావేశం


రెండు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను డీజీపీ దినేష్ రెడ్డి కలుసుకున్నారు. వీరిరువురు సచివాలయంలో సమావేశం అయ్యారు. శంకరరావు అరెస్ట్ సహా పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. తన తండ్రి విషయంలో పోలీసులు అనుసరించిన తీరును తప్పు పడుతూ శంకరరావు కూతురు సుస్మిత ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేసారు. ఈ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News