: చేతులెత్తేసిన తెలుగు తారలు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ చేతులెత్తేసింది. కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో తెలుగు వారియర్స్ ఇంటి ముఖం పట్టారు. శనివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షుకుల్లో ఉత్కంఠ రేపింది. టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అఖిల్ 46 బంతులలో 90 పరుగులతో చక్కటి ప్రదర్శన ఇచ్చాడు. సుధీర్(40), ప్రిన్స్(50) పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు వారియర్స్ 190 పరుగులు సాధించింది. 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్ ఆటగాళ్లు మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ధ్రువ్ అయితే రెచ్చిపోయి ఏడు సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో విజయం వారిసొంతమైంది. మరోవైపు ముంబై హీరోస్, వీర్ మరాఠి మధ్య జరిగిన పోరులో ముంబై హీరోస్ నే గెలుపు వరించింది.