: ఆమె సోనియాగాంధీ కాదు.. ‘సోనియా గాడ్సే’: చంద్రబాబు
దేశంలో అవినీతికి, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న సోనియా గాంధీని.. ‘సోనియా గాడ్సే’గా చంద్రబాబు అభివర్ణించారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి రాష్ట్రంలో సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలుగు వారి మధ్య విధ్వంసం సృష్టించింది సోనియాగాంధీయేనని బాబు స్పష్టం చేశారు. వీరోచితంగా పోరాడటం తప్ప.. కుట్రలు, కుతంత్రాలు చేయడం తనకు చేతకాదని చంద్రబాబు చెప్పారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి.. సోనియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.