: మోడీ 'చాయ్ పే చర్చ'ను తప్పుబట్టిన మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న'చాయ్ పే చర్చ'ను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. కేవలం ఎన్నికల ముందు చాయ్ దుకాణాల్లో కూర్చొని చర్చలు చేపట్టడంపై తమకు నమ్మకం లేదన్నారు. కోల్ కతా సమీపంలోని దుర్గాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మమత మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎం) పార్టీలకు వ్యతిరేకంగా ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని మమత తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మణిపూర్, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను జాతీయస్థాయికి విస్తరిస్తామని చెప్పారు.