: శ్రీలంక అంశంపై నేడే 'ఐరాస'లో ఓటింగ్


శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంమీద భారత దేశంలో రాజకీయ కలకలం కూడా రేగింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనైతే, శ్రీలంక ప్రభుత్వం చేస్తోన్న ఊచకోతలకు నిరసనగా ఒక ఉద్యమమే రూపుదాల్చింది. ఈ తరుణంలో నేడు జనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఈ అంశంపై ఓటింగ్ జరుగనుంది.

కాగా,  ఈ తీర్మానం ప్రకారం శ్రీలంక అధికార సంక్రమణం చేయాలి. మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం వంటి అంశాల్లో స్థానిక ప్రజలను, మైనారిటీలను భాగస్వాములు చేయాలి. ఈ తీర్మానం ప్రకారం శ్రీలంక ప్రభుత్వం తాను చేయాల్సిన విధులను తప్పనిసరిగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే, యూఎన్ హెచ్ఆర్సీ లో అమెరికా ప్రవేశపెట్టనున్న తీర్మానంపై శ్రీలంక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   

  • Loading...

More Telugu News