: ‘ప్రజాగర్జన’కు వెళుతూ.. మోటార్ సైకిల్ నడిపిన చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ‘ప్రజాగర్జన’ సభలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు పయనమయ్యారు. విమానంలో విజయవాడకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంకు బయల్దేరారు. మార్గమధ్యంలో కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో రెండు కిలోమీటర్ల వరకు బాబు మోటార్ సైకిల్ (బైక్) నడిపి టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ‘ప్రజాగర్జన’ సభకు ఆయన ర్యాలీగా బయల్దేరి వెళుతున్నారు. ఆయనను భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుసరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే తాడేపల్లిగూడెం చేరుకున్నారు.

  • Loading...

More Telugu News