: రోడ్డెక్కకముందే హల్ చల్ చేస్తున్న కొత్త కారు


మారుతి సుజుకి సంస్థ నుంచి మార్కెట్లోకి రానున్న కొత్త కారు సెలెరియోకు అప్పుడే మాంచి డిమాండ్ పలుకుతోంది. ఇటీవలే ఢిల్లీలో ముగిసిన ఆటో ఎక్స్ పో-2014లో ఈ కారును మారుతి సంస్థ లాంచ్ చేసింది. గత గురువారం ఈ కారును ఆవిష్కరించగా, ఆన్ లైన్లో ఈ చిన్న కారుకు సంబంధించి మిక్కిలిగా సెర్చ్ చేశారట నెటిజన్లు. ఈ కారు ఆటో గేర్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ మోడ్ తో వస్తోంది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.9-రూ.4.9 లక్షల మధ్యన ఉంది. ఆకర్షణీయమైన రూపంతో వస్తున్న ఈ కారు భారత మార్కెట్లో మారుతి స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇక ఈ కారు తర్వాత గూగుల్లో అత్యధికంగా టాటా బోల్ట్, హ్యుండాయ్ ఎక్సెంట్, హోండా జాజ్, టయోటా ఎటియోస్ క్రాస్ వాహనాల గురించి సెర్చ్ చేశారట.

  • Loading...

More Telugu News