: వామ్మో.. అంత స్పీడా..!


నెట్ లో సెకనుకు 50 ఎంబీపీఎస్ స్పీడంటే ఓ రకంగా సూపర్ సోనిక్ స్పీడే. అదే సెకను 10 గిగాబైట్ల (81920 ఎంబీ) స్పీడంటే.. నిజంగా హైపర్ సోనిక్కే. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఈ సరికొత్త సాంకేతికతపై కసరత్తులు చేస్తోంది. త్వరలోనే ఇది నెట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది. ప్రస్తుతం గూగుల్ ఫైబర్ సర్వీస్ సెకనుకు 1 గిగాబైట్ స్పీడ్ అందిస్తోంది. తాజా పరిజ్ఞానం ద్వారా డేటా బదలాయింపు అత్యంత త్వరితగతిన వీలవుతుంది. తద్వారా సంక్లిష్టమైన వెబ్ అప్లికేషన్లు సైతం నెట్ లో అత్యంత సాఫీగా రన్ అవుతాయి. మరో మూడేళ్ళలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పాట్రిక్ పిచెటే తెలిపారు. ఇదిలావుంటే, తాము ఆవిష్కరించిన 'లై-ఫై టెక్నాలజీ' (కాంతి ఆధారిత) తో సెకనుకు 10 గిగాబైట్ల స్పీడు సాధ్యమేనని యూకే శాస్త్రవేత్తలు గతేడాదే ప్రకటించినా, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

  • Loading...

More Telugu News